ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కబడ్డీ ఆడిస్తున్న మోహన్ బాబు

Wed, Nov 26, 2014
మోహన్ బాబు
మోహన్ బాబు
తన తనయుల మధ్య పోటీకి విలక్షణ నటుడు మోహన్ బాబు మధ్యవర్తి పాత్ర పోషించనున్నారు. తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ నిర్వహించే 'మేము సైతం' కార్యక్రమంలో ఈ ముచ్చట చోటు చేసుకుంటోంది. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30 మధ్యాహ్నం కబడ్డీ పోటీని ఏర్పాటు చేశారు. ఇందులో మంచు విష్ణు కెప్టెన్ గా ఒక జట్టు ... మంచు మనోజ్ కెప్టెన్ గా మరో జట్టు తలపడతాయి. ఈ పోటీకి ఈ సోదరుల తండ్రి మోహన్ బాబు రిఫరీగా వ్యవహరించనున్నారు. ఈ కబడ్డీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుందని భావిస్తున్నారు. ఆయా జట్లలో హీరోలు, హీరోయిన్లు, కమేడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటారు.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)