ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

టీవీలో చైతూ బర్త్ డే గిఫ్ట్!

Tue, Nov 18, 2014
గతంలో ఒక సినిమా రిలీజైన తర్వాత వంద రోజులు దాటాకనే ఆ చిత్రాన్ని టీవీలో ప్రసారం చేసేవారు. దాని వల్ల ధియేటర్లో ప్రదర్శనకు ఎఫెక్ట్ అయ్యేది కాదు. అయితే, ఇటీవల పధ్ధతి మారిపోయింది. సినిమా రిలీజైన వెంటనే టీవీలో కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య నటించిన 'ఒక లైలా కోసం' కూడా అలాగే ఈ నెల 23న టీవీలో ప్రసారం చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న రిలీజైంది. అయితే, కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దాంతో వెంటనే ప్రసారం చేస్తేనే దీనికి టీఆర్పీ బాగుంటుందన్న ఉద్దేశంతో 23న టెలికేస్ట్ చేయడానికి, ఈ చిత్రాన్ని తీసుకున్న మాటీవీ నిర్ణయించుకుందట. పైగా ఆ రోజు నాగచైతన్య బర్త్ డే కావడంతో కలిసొస్తుందని భావిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)