ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'క్రౌడ్ ఫండింగ్' సినిమా

Tue, Nov 18, 2014
'నా బంగారు తల్లి'లో ఓ దృశ్యం
'నా బంగారు తల్లి'లో ఓ దృశ్యం
సినిమా అయితే తీశారు కానీ, ఎలా రిలీజ్ చేయాలో తెలియక ఆ నిర్మాత సతమతమవుతుంటే, అక్కినేని అమల నుంచి వారికి మంచి సలహా అందింది. దాంతో ప్రజల నుంచి సేకరించిన నిధితో (క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్) చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఆ నిర్మాత సిద్ధమయ్యారు. ఆ చిత్రమే 'నా బంగారు తల్లి'! వేశ్యా గృహాలకు అక్రమంగా తరలుతున్న అమ్మాయిల వ్యథార్థ కథల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించగా, సునీత కృష్ణన్ దీనిని నిర్మించారు.



దీని గురించి నిర్మాత సునీత చెబుతూ, "సినిమా బాగుందని అంతా ప్రశంసించారు. అయితే, రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో క్రౌడ్ ఫండింగుకి వెళ్లమని అక్కినేని అమలగారు ఫేస్ బుక్ ద్వారా మాకు సలహా ఇచ్చారు. ఆమె చెప్పిన ప్రకారం వెళ్లాం. 32 లక్షలు సేకరించాం. ఓ అజ్ఞాత వ్యక్తి అయితే ఏకంగా 12 లక్షలు ఇచ్చారు. వీరందరి సహకారంతో దీనిని తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఢిల్లీ, ముంబయ్, బెంగళూరు, చెన్నయ్ తో బాటు అమెరికాలో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ 21న విడుదల చేస్తున్నాం" అని చెప్పారు. ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకకు చిరంజీవి హాజరవడమే కాకుండా, దీనికి బ్రాండ్ అంబాసడార్ గా వ్యవహరించడానికి కూడా అంగీకరించారు.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)