ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ కృష్ణవంశీతో ఎన్టీఆర్

Mon, Nov 17, 2014
కృష్ణవంశీ
కృష్ణవంశీ
కృష్ణవంశీ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నట్టు టాలీవుడ్ లో ఒక్కసారిగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల రామ్ చరణ్ తో తాను తీసిన 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన కృష్ణవంశీ, రెండు రోజుల క్రితం గోవా వెళ్లి అక్కడ ఎన్టీఆర్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కోసం గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ గోవాలో వున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు వీరి భేటీ నేపథ్యంలో ఈ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. వీరి సమావేశాన్ని ఏర్పాటు చేసిన నిర్మాత బండ్ల గణేశే ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని అంటున్నారు. ఇదిలా ఉంచితే, ఎన్టీఆర్-కృష్ణవంశీ కాంబోలో గతంలో 'రాఖీ' సినిమా వచ్చిన విషయం విదితమే!
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)