ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గుణశేఖర్ కి కృష్ణవంశీ సెల్యూట్!

Fri, Nov 14, 2014
క్రియేటివ్ దర్శకుడు అన్న వ్యక్తి ఎక్కడ క్రియేటివిటీ కనిపించినా ఆగలేడు. వెంటనే స్పందిస్తాడు. తన ప్రశంసలు కురిపిస్తాడు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కూడా అలాగే 'రుద్రమదేవి' సినిమా విషయంలో గుణశేఖర్ సృజనాత్మక శైలికి స్పందించాడు. 'సెల్యూట్ టు గుణ సార్' అంటూ ప్రారంభించి, "రుద్రమదేవి మేకింగ్ చూశాను. అశ్లీల పదాలతో కూడిన పాటలు, అర్థంపర్థం లేని సినిమాలు వస్తున్న తరుణంలో, మరుగునపడిపోయిన మన సంస్కృతిని, విలువలను చాటి చెప్పేలా సినిమా తీయడానికి గుణశేఖర్ ప్రయత్నిస్తున్నారు. ఒక సాహసోపేతమైన దక్షిణాది మహారాణి కథను మన ముందుకు తీసుకువస్తున్నారు. అనుష్కను తప్ప ఆ పాత్రలో మరొకరిని ఊహించలేం. అలాగే గోన గన్నారెడ్డిగా బన్నీ డైనమిక్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయలేను.. త్వరగా చూడాలి" అంటూ వంశీ కాంప్లిమెంట్స్ కురిపించాడు. సినిమా విడుదలకు ముందే దర్శకుడు గుణకు లభించిన తొలి ప్రశంసగా దీనిని మనం పరిగణించవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)