ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రీమేక్ రైట్స్ ఇవ్వరట!

Wed, Nov 12, 2014
ఇటీవల వచ్చిన 'కార్తికేయ' చిత్రం సూపర్ హిట్టయి, చిన్న చిత్రాలలో పెద్ద చిత్రంగా నిలిచింది. నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు 20 కోట్లు వసూలు చేసిందని నిర్మాత ప్రకటించారు. దీనికి శాటిలైట్ రూపేణా వచ్చే మొత్తాన్ని, ఓవర్సీస్ ప్రదర్శన ద్వారా వచ్చే గ్రాస్ నీ కలుపుకుంటే మరింత పెరుగుతుంది. అంటే నిఖిల్ లాంటి హీరో విషయంలో ఇది పెద్ద బిజినెస్ కిందే లెక్క. ఇదిలా ఉంచితే, ఈ చిత్రం సాధించిన విజయాన్ని చూసి, ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దీనిని తన తనయుడు జీవాతో తమిళంలో రీమేక్ చేయాలని ఆశించారు. అయితే, 'కార్తికేయ' నిర్మాత మాత్రం అందుకు ఒప్పుకోలేదట. నిఖిల్ ని తమిళ రంగానికి పరిచయం చేస్తానని మాటిచ్చాననీ, అందుకని దీనిని తప్పకుండా డబ్ చేస్తాననీ తేల్చి చెప్పేశాడట!
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)