ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుకుమార్ 'కుమారి 21 F'

Sun, Nov 09, 2014
'కుమారి 21 F'లో రాజ్ తరుణ్, షీనా
'కుమారి 21 F'లో రాజ్ తరుణ్, షీనా
దర్శకుడు సుకుమార్ తదుపరి చిత్రం పేరు 'కుమారి 21 F'. అయితే, ఇది ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాదు. ఆయన నిర్మాతగా తీస్తున్న సినిమా పేరిది. ఇటీవల సుకుమార్ తన మిత్రులతో కలసి చిన్న సినిమాలను, కొత్త దర్శకులను ప్రోత్సహించడానికి చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి సినిమాగా 'చక్కిలిగింత' చిత్రాన్ని తీస్తున్నాడు. ఇప్పుడు తన రెండో చిత్రంగా 'కుమారి 21 F'ను ఈ రోజు ప్రారంభించాడు. ఇందులో 'ఉయ్యాల జంపాల' ఫేం రాజ్ తరుణ్ హీరోగా నటిస్తుండగా... షీనా బజాజ్ కథానాయికగా నటిస్తోంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై తొలిషాట్ తీశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగును నిర్వహిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)