ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ ఛాన్స్ రావాలంటున్న చిన్నది!

Sat, Nov 08, 2014
దీపికా పదుకొనె
దీపికా పదుకొనె
షారుక్ ఖాన్ తో మూడు చిత్రాల్లో నటించి హ్యట్రిక్ కొట్టిన దీపికా పదుకొనె, సల్మాన్ ఖాన్ తో మాత్రం నటించడం లేదు. గతంలో ఓ సినిమాలో అవకాశం వచ్చినా 'నో' చెప్పిందట. అయితే ఈ వార్తలను అమ్మడు ఇప్పుడు ఖండిస్తోంది. సల్మాన్ ప్రాజెక్టులో చేయనని అసలెప్పుడూ తాను చెప్పలేదని దీపిక స్పష్టం చేసింది. తామెప్పుడు కలసి నటించాలో విధే నిర్ణయిస్తుందంటోందీ భామ. "ఎవరితోనూ నటించనని చెప్పడానికి నేనెవరిని? నాకా అధికారం కానీ, ఆ స్థానం కానీ లేదు. సల్మాన్ తో చేయాలనుకోవడం లేదని నేనెప్పుడూ చెప్పలేదు. వాస్తవానికి, తనతో కలసి నటించాలనుకుంటున్నా. కానీ, ప్రతి సినిమా విధి ప్రకారమే ఉంటుంది. ఒకవేళ ఇద్దరం చేసే సమయం వస్తే, ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుంది" అని వేదాంత ధోరణిలో దీపు సెలవిచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)