ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పోలీసాఫీసర్ గా రామ్ చరణ్!

Wed, Nov 05, 2014
రామ్ చరణ్
రామ్ చరణ్
'గోవిందుడు అందరి వాడేలే' తర్వాత రామ్ చరణ్ చేసే సినిమా ఏమిటన్నది సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో, తన తదుపరి చిత్రానికి ఈ మెగా హీరో రెడీ అవుతున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చరణ్ ఈ చిత్రాన్ని చేస్తాడని తాజా సమాచారం. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా గౌతమ్ ఓ తమిళ చిత్రానికి పనిచేస్తున్నాడు. అజిత్ హీరోగా అనుష్క, త్రిష కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పూర్తవగానే చరణ్ సినిమా పనిని గౌతమ్ ప్రారంభిస్తాడని అంటున్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో చరణ్ పోలీసాఫీసర్ గా నటిస్తాడట. అందుకే, ఇటీవల తన హెయిర్ స్టయిల్ ని ఈ హీరో అందుకు తగ్గట్టుగా మార్చుకున్నాడని వార్తలు వస్తున్నాయి. మామూలుగా గౌతమ్ సినిమాలలో హీరో చాలా స్టయిల్ గా కనపడతాడు. మరి, చరణ్ ని ఆయన ఏ స్టయిల్ లో చూపిస్తాడో!
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)