ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీ సినిమాలో అమితాబ్?

Tue, Nov 04, 2014
అమితాబ్
అమితాబ్
అల్లు అర్జున్ కి ఇప్పుడు మంచి తండ్రి కావాలట. కన్ఫ్యూజ్ అవకండి ... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బన్నీ తండ్రిగా నటించే ఆర్టిస్టు కోసం అన్వేషణ సాగుతోంది. మంచి స్టేచర్ వున్న నటుడు ఆ పాత్ర పోషించాలట. అప్పుడే అది బాగా పండుతుందని దర్శకుడు భావిస్తున్నాడు. దాంతో పలువురు నటులను పరిశీలించారు. ఇప్పటికే మలయాళ నటులు మమ్ముట్టి, మోహన్ లాల్ లను సంప్రదించారనీ, అయితే, వివిధ కారణాల వల్ల వారి నుంచి సానుకూలమైన స్పందన రాలేదనీ అంటున్నారు.



దీంతో ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను కాంటాక్ట్ చేస్తున్నారని సమాచారం. సినిమాలో ఇది కాస్సేపు మాత్రమే కనిపిస్తుంది కాబట్టి, ఎక్కువ రోజుల షూటింగ్ కూడా అవసరం లేదని అంటున్నారు. మరి, అమితాబ్ ఓకే చెబుతాడా? అన్నది చూడాలి. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక, సినిమా స్థాయి విపరీతంగా పెరుగుతుందనడంలో సందేహం లేదు!
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)