ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రీదేవి కోసం కమల్ కథ!

Sat, Nov 01, 2014
కమల్, శ్రీదేవి
కమల్, శ్రీదేవి
కెరీర్ ఆరంభంలో కమలహాసన్, శ్రీదేవి కలసి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.70, 80 దశకాల్లో వీరిద్దరు దాదాపు 23 చిత్రాల్లో జత కట్టి సూపర్ హిట్ పెయర్ గా గుర్తింపు పొందారు. వీరిద్దరు కలిసి తమిళంలో నటించిన చిత్రం ఆఖరి చిత్రం 'మూండ్రమ్ పిరాయ్' (తెలుగులో వసంత కోకిల). బాలు మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వీరిద్దరి నటనకు అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తెలుగులో వీరిద్దరి ఆఖరి చిత్రం 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు'. 1986లో రిలీజైన ఈ చిత్రం తర్వాత కమల్, శ్రీదేవి మళ్లీ కలసి నటించలేదు.

ఇటీవల చాలా సందర్భాల్లో శ్రీదేవితో మళ్లీ కలసి నటించాలన్న ఆకాంక్షను కమల్ వ్యక్తం చేశాడు. గతేడాది, శ్రీదేవి 'ఇంగ్లిష్ వింగ్లీష్'తో వెండితెరపై గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వడంతో కమల్ ఆమెతో మళ్లీ కలసి నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. ఆమెతో కలసి మళ్లీ నటించాలని తాను చాలా కాలంగా ఎదురుచుస్తున్నానని, ఈ విషయాన్ని ఆమెకు కూడా చాలాసార్లు తెలిపానని కమల్ చెబుతున్నాడు. తామిద్దం మళ్లీ కలసి నటించడం కోసం స్వయంగా తాను ఓ కథను ప్రస్తుతం రాస్తున్నానని ఆయన కోలీవుడ్ మీడియాకు తెలిపాడు. స్క్రిప్ట్ రెడీ అయిన వెంటనే, శ్రీదేవిని సంప్రదిస్తానని కమల్ అంటున్నాడు.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)