ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విష్ణు సినిమాలో ఆదాశర్మ

Sat, Nov 01, 2014
అదాశర్మ
అదాశర్మ
పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'హార్ట్ ఎటాక్'తో ఈ ఏడాది టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఆదాశర్మకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఆమె నటిస్తోంది. దీంతో పాటు, ఆది హీరోగా 'పెళ్లైన కొత్తలో' ఫేం మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది.

ఈ రెండు చిత్రాలతో పాటు తాజాగా, మంచు విష్ణు హీరోగా దేవా కట్ట దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఈ ఏడాది తమిళంలో సూపర్ హిట్టైన 'అరిమా నంబి'కి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు చిత్రాలతో పాటు ఆమె ప్రస్తుతం ఓ కన్నడ చిత్రంలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. పవన్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా రూపొందుతున్న 'ధీర రణ విక్రమ'లో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)