ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Wed, Oct 29, 2014
నవీన
నవీన
* సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘ఐస్ క్రీమ్ 2′ నవంబర్ 7న విడుదలవుతుంది. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి, నవీన, నందు, జీవా, ధనరాజ్, సిద్దు, భూపాల్ ముఖ్య పాత్రలు పోషించారు.
* ఉత్తరాంధ్ర తుపాను బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ నవంబర్ లో నిర్వహిస్తున్న గ్రాండ్ ఈవెంట్ 'వియ్ లవ్ వైజాగ్'కు దక్షిణాది దిగ్గజ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లు హాజరవుతున్నారని ఫిలింనగర్ సమాచారం.
* సాయిధరమ్ తేజ్, రెజీనా హీరోహీరోయిన్లుగా రూపొందిన 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేస్తున్నారు. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్, హర్షిత్ లు సంయుక్తంగా నిర్మించారు.
* ఇప్పటి వరకు ప్రేమకథా చిత్రాల్లో మాత్రమే నటించిన ఆది, తాజాగా 'రఫ్' ద్వారా యాక్షన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సురేందర్ రెడ్డి శిష్యుడు సుబ్బారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. రఫ్ ఆడియోను నవంబర్ 2న టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)