ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కమల్ చిత్రం 39 రోజుల్లో పూర్తి

Mon, Oct 27, 2014
కమల్ హాసన్
కమల్ హాసన్
తెలుగులో వెంకటేశ్ హీరోగా నటించిన 'దృశ్యం' చిత్రాన్ని తమిళంలో కమల్ హాసన్ హీరోగా 'పాపనాశం' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! ఈ చిత్రం షూటింగ్ ను కేవలం 39 రోజుల్లో పూర్తి చేశారట! కమల్ సహకారంతోనే ఇంత త్వరగా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయగలిగామని చిత్ర వర్గాలు అంటున్నాయి. దీంతో పాటు, నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందిన 'ఉత్తమ విలన్' షూటింగ్ ను కూడా కమల్ ఇటీవలే పూర్తి చేశారని చెన్నై వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం, ఈ రెండు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్టు సమాచారం. అలాగే, 'విశ్వరూపం 2' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకోవడంతో, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో కమల్ చిత్రాలు మూడు ఉన్నట్టు అవుతోంది. 'విశ్వరూపం 2' చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో.. 'పాపనాశం', 'ఉత్తమవిలన్' చిత్రాలను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని కమల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)