ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'లింగా' ఆడియోకు ముహూర్తం

Mon, Oct 27, 2014
లింగా
లింగా
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లింగా' ఆడియో వేడుకకు తేదీ ఖరారైంది. ఈ సినిమా ఆడియో వేడుకను నవంబర్ 7న చెన్నైలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత నవంబర్ నెలాఖరులో తెలుగు వెర్షన్ ఆడియో కార్యక్రమాన్ని హైదరాబాదులో నిర్వహిస్తారు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయింది. రజనీ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్నారు

'లింగా' ఆడియో హక్కులను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కైవసం చేసుకుంది. ఆడియో రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈరోస్ సంస్థ ఆడియో హక్కులు తీసుకున్న రెండో పెద్ద చిత్రం 'లింగా'. గతంలో విజయ్ హీరోగా నటించిన 'కత్తి' ఆడియో హక్కులు తీసుకోవడం ద్వారా ఆడియో రంగంలో తొలి పెద్ద చిత్రాన్ని ఈరోస్ సంస్థ తీసుకున్నట్టయింది. డిసెంబర్ 12న రజనీ జన్మదినం రోజున ప్రపంచవ్యాప్తంగా 'లింగా' చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)