ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ డైరెక్షన్ లో 'గబ్బర్ సింగ్ 2'?

Sat, Oct 25, 2014
పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్
ఇంతకాలం పెండింగ్ లో ఉన్న 'గబ్బర్ సింగ్ 2' త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. దానికి పవన్ కల్యాణే దర్శకత్వం వహిస్తాడని టాలీవుడ్ వర్గాల టాక్. 'గబ్బర్ సింగ్'కు సీక్వెల్ అనుకున్నప్పటి నుంచీ దర్శకుడిగా సంపత్ నంది వర్క్ చేస్తూ వచ్చాడు. దాదాపు రెండేళ్లు గడిచినా ఈ ప్రాజెక్టు షూటింగ్ వరకు వెళ్లలేదు. దాంతో, తన విలువైన కాలం వృథా అయిందని భావించిన సంపత్ మరో ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాడని, హీరో రవితేజతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ దర్శకత్వ బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

"ఈ ప్రాజెక్టుకోసం సంపత్ నంది చాలా ఎదురుచూశాడు. ఎంతకీ చిత్రీకరణ ప్రారంభించకపోవడంతో నెక్స్ట్ మూవీకి షిఫ్ట్ అవ్వాలనుకున్నాడు. అందువలన తానే ఈ సినిమాను తెరకెక్కించాలని పవన్ సర్ భావిస్తున్నారు" అని చిత్ర యూనిట్ కు సంబంధించిన ఒకరు తెలిపారు. అన్నట్లు ఈ చిత్రానికి పవన్ సహ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)