ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వంద కిళ్లీలు తిన్న హీరో!

Sat, Oct 25, 2014
అమీర్ ఖాన్
అమీర్ ఖాన్
సినిమాలో తాము పోషించే పాత్ర స్వభావాన్ని బట్టి ఆయా ఆర్టిస్టులు తమకు అలవాటు లేని పనులు కూడా కొన్ని చేస్తుండాలి. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఈమధ్య అలాగే కిళ్లీలు బాగా తినాల్సివచ్చింది. ప్రస్తుతం తాను నటిస్తున్న 'పీకే' చిత్రం కోసం ఇలా కిళ్లీలను తెగ నమిలాడట. ఈ సినిమాలో అమీర్ మొత్తం తొమ్మిది గెటప్పు లలో మనకు దర్శనమిస్తాడు. వాటిలో ఓ గెటప్పు తమాషాగా వుంటుంది. ఎప్పుడూ కిళ్లీలు నములుతూ, పక్కనే ఉమ్ములేస్తూ ఉంటాడట.



దీని గురించి అమీర్ చెబుతూ, "మామూలుగా నాకు కిళ్లీ తినే అలవాటు లేదు. ఎప్పుడైనా ఒకటీ అరా తింటానంతే. అయితే, ఈ పాత్ర కోసం రోజుకి వంద కిళ్లీలను తిన్నాను. ఆ షూటింగు జరిగినన్నాళ్ళూ ఓ పాన్ వాలా మాతోనే ఉంటూ ఎప్పటికప్పుడు కిళ్లీలు చుట్టి ఇస్తుండేవాడు" అని వివరించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఎంతో సంచలనం సృష్టించిన ఈ సినిమా రేపు రిలీజయ్యాక మరెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి!
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)