ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రానా, త్రిష విడిపోయారా?

Wed, Oct 22, 2014
రానా-త్రిష
రానా-త్రిష
రానా, త్రిషలు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాము కేవలం స్నేహితులమేనని వీరిద్దరూ చాలా సందర్భాల్లో స్పష్టం చేసినప్పటికీ ఫిలిం అవార్డ్ ఫంక్షన్స్, ఐపీఎల్, మూవీ ప్రీమియర్స్, ఈవెంట్స్, రెస్టారెంట్స్, పార్టీలకు ఇద్దరు కలసి వస్తుండటంతో వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని మీడియాలో గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, తాజాగా రానా, త్రిషల ప్రేమాయణానికి బ్రేక్ పడిందని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వీరద్దరూ ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి వీరి మధ్య వ్యవహారం చెడిందని తెలుస్తోంది. రానా, త్రిషలు ఇరువురు ట్విట్టర్ లో నిన్నమొన్నటి వరకు ఒకరినొకరు ఫాలో అయ్యేవారు. అయితే, ఇటీవల కాలంలో రానా త్రిషను అన్ ఫాలో చేయగా, త్రిష కూడా రానాను అన్ ఫాలో చేసింది. అలాగే, ఇటీవల కాలంలో వీరిద్దరూ ఇస్తున్న ట్వీట్స్ కూడా వీరిద్దరు విడిపోయారనే భావనను బలపరుస్తున్నాయి.

''ఓ కథకు ఎప్పుడూ మూడు కోణాలుంటాయి. నీ వైపు కోణం ఒకటి, ఎదుటి వారి కోణం ఒకటి. కానీ నిజమైన మూడో కోణం పై రెండింటికి భిన్నంగా ఉంటుంది" అంటూ రానా ట్వీట్ చేశాడు. అలాగే, ఒకరికి గుడ్ బై చెప్పడం చాలా సులువని, కానీ వారి జ్ఞాపకాలను మరిచిపోవడం చాలా కష్టమని మరో ట్వీట్ చేశాడు. త్రిష కూడా ఈ విషయంలో ఏం తగ్గలేదు. ఒకరు తప్పుచేసినప్పుడు క్షమించడం చాలా సులువని...కానీ వారి మీద మరలా నమ్మకం పెట్టుకోవడం చాలా కష్టమని వ్యాఖ్యానించింది. నిన్ను నేను 'కట్ ' చేసానంటే, అలా చేసేందుకు 'కత్తెర' నువ్వే ఇచ్చి ఉంటావు అని మరో ట్వీట్ చేసింది.


ఇలా ఒకరి పేరు మరొకరు ప్రస్తావించకుండా... ఒకరిని ఉద్దేశించి మరొకరు పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తుండటంతో, ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉండటం కారణంగానే త్రిష రానాకు గుడ్ బై చెప్పిందని ఫిలింనగర్ సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)