ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ ఎవరికి ఓకే చెబుతాడో!

Tue, Oct 21, 2014
రాంచరణ్
రాంచరణ్
'గోవిందుడు అందరి వాడేలే' విజయం తర్వాత రాంచరణ్ ఎవరి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడనే విషయంలో సందిగ్ధత నెలకొంది. వాస్తవంగా, ఈ చిత్రం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించడానికి రాంచరణ్ కమిట్ అయ్యాడు. అయితే, 'ఆగడు' సినిమా ప్లాప్ అవడంతో... శ్రీను వైట్ల ప్రాజెక్ట్ విషయంలో ఆయన తుది నిర్ణయం చెప్పలేదు. ఇదే సమయంలో, గోపి మోహన్- కోన వెంకట్ లు ఓ స్క్రిప్ట్ ను రాంచరణ్ కు వినిపించారు. ఈ కథ రాంచరణ్ కు నచ్చడంతో, దీనికి దర్శకుడిగా 'లౌక్యం'తో హిట్ నందుకున్న శ్రీవాస్ పేరును వారిద్దరు ప్రపోజ్ చేశారు. రాంచరణ్ కూడా శ్రీవాస్ దర్శకత్వంలో నటించడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.

అలాగే, శ్రీను వైట్ల ప్రస్తుతం మరో ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశీతో కలిసి రాంచరణ్ కోసం ఓ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. వీరిద్దరిలో ఎవరి ప్రాజెక్ట్ కు ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో తెలియక రాంచరణ్ డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, ఈ హీరో తన తదుపరి చిత్రాన్ని శ్రీను వైట్లకు చేస్తాడా? లేక శ్రీవాస్ కు చేస్తాడా? అని ఫిలింనగర్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)