ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డబ్బింగులో రజనీ స్పీడు

Sat, Oct 18, 2014
రజనీకాంత్
రజనీకాంత్
'లింగా' డబ్బింగును రజనీకాంత్ అతి వేగంగా పూర్తి చేశారట! విశ్వసనీయం వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో తన పాత్రల డబ్బింగ్ మొత్తాన్ని రజనీ ఆశ్చర్యపడే రీతిలో ఒక్క రోజులో పూర్తి చేశారని తెలుస్తోంది. సాధారణంగా హీరోలు తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పడానికి 5 రోజుల నుంచి 10 రోజుల వరకు తీసుకుంటారు. కానీ, రజనీ ఒక్క రోజులో పూర్తిచేయడంతో దర్శకుడు రవికుమార్ సైతం ఆశ్చర్యపోయారట! డబ్బింగ్ లో అన్నీ సింగిల్ టేక్స్ తీసుకోవడం వల్లే ఒక్క రోజులో రజనీ వర్క్ మొత్తం పూర్తయ్యిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. రజనీ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. రెండు పాటలు మినహా 'లింగా' షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.

ప్రస్తుతం, రామోజీ ఫిలింసిటీలో రజనీపై ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.'లింగా' చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా, ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.11.50
Related News

Warning: mysql_fetch_array() expects parameter 1 to be resource, boolean given in /home/srirama/public_html/ap7am-nf/movie-news-nf/ap7am-movie-news-related-widget.php on line 9
Movie News (Latest)