ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజకు అలాంటివి కావాలట!

Fri, Oct 17, 2014
రవితేజ
రవితేజ
'బలుపు', 'పవర్' చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో హీరోగా రవితేజ కెరీర్ మళ్లీ గాడిలో పడింది. ఇటీవల కాలంలో విజయాల కోసం పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ చిత్రాల్లోనే నటిస్తున్నానని... కానీ, తనకు ప్రయోగాలు చేయడం కూడా ఇష్టమేనని రవితేజ అన్నాడు. హీరోగా తన కెరీర్ 'సింధూరం' లాంటి ప్రయోగాత్మక చిత్రంతోనే ప్రారంభమయ్యిందని, ఆ తర్వాత కూడా తాను 'నా ఆటోగ్రాఫ్ర్','నేనింతే', 'శంభో శివ శంభో' లాంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించానని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ చిత్రాలు ప్రేక్షాకాదరణ పొందకపోయినప్పటికీ, నటుడిగా తనకు మంచిపేరును, అవార్డులను తెచ్చిపెట్టాయని ఆయన తెలిపాడు.


కమర్షియల్ హీరోగా ఎదిగినప్పటికీ తాను ప్రయోగాలు చేయడానికి ఎప్పుడుా సిద్ధమేనని... కానీ అటువంటి స్క్రిప్టులతో కథారచయితలు ఎవరూ తన దగ్గరకు రావడం లేదని ఆయన అన్నాడు. హాలీవుడ్ లో తెరకెక్కిన 'టేకన్' లాంటి కథలతో ఎవరైనా వస్తే తాను నటించడానికి సిద్ధమని ఆయన పేర్కొన్నాడు.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)