ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కమల్ ను ఇబ్బంది పెట్టిన రబ్బర్!

Fri, Oct 17, 2014
కమల్ హాసన్
కమల్ హాసన్
జాతీయ నటుడు కమల్ హసన్ ను చిన్న రబ్బరు బెరుడు పెద్ద ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం ఆయన 'పాపనాశం' అనే తమిళ సినిమాలో (తెలుగులో 'దృశ్యం') నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను, కేరళలోని ఇడుక్కి జిల్లా తొడుపుళా ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. దీన్లో భాగంగా, పోలీసు పాత్రధారి కళాభవన్ మణి కమల్ ను కొట్టే సన్నివేశాలను తీస్తున్నారు. ఈ క్రమంలోనే, కమల్ ముఖాన్ని ఉబ్బినట్టుగా చూపించేందుకు గాను ఆయన ముక్కులోపల రబ్బరు బెరడు ఉంచినట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఫైటింగ్ సన్నివేశాల్లో నటీనటుల ముఖాలు ఉబ్బినట్లుగా చూపించాలంటే దర్శకులు రబ్బరు బెరడును వాడుతుంటారు. అయితే, అనుకోకుండా అది కమల్ ముక్కులోనికి వెళ్లి చిక్కుకుపోవడంతో శ్వాస తీసుకోవడానికి ఆయన తీవ్ర ఇబ్బంది పడ్డారు. వెంటనే, స్థానికంగా ఉన్న ఆసుపత్రికి ఆయనను తరలించారు. వైద్యులు ఎండోస్కోపీ ద్వారా బెరడును తొలగించారు. సంఘటన జరిగిన మూడుగంటల అనంతరం, యథావిధిగా కమల్ షూటింగ్ లో పాల్గొన్నారని చిత్రవర్గాలు వెల్లడించాయి.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)