ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాజ్ కుమార్ పాత్రలో రజనీ!

Fri, Oct 17, 2014
'బంగారద మనుష్య'లో  రాజ్ కుమార్
'బంగారద మనుష్య'లో రాజ్ కుమార్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో ఓ కన్నడ రీమేక్ లో నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు నలభై ఏళ్ల క్రితం కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ నటించిన 'బంగారద మనుష్య' చిత్రం అప్పట్లో సూపర్ హిట్టయింది. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ... విద్యాధికులు కూడా వ్యవసాయ రంగంలోకి రావాలంటూ ఈ సినిమా ఇచ్చిన సందేశం అందర్నీ ఆలోచింపజేసింది. ఇప్పుడీ చిత్రాన్ని రజనీ తమిళంలో రీమేక్ చేయనున్నాడు.


దీని గురించి రజనీ ఆప్తమిత్రుడు రాజ్ బహదూర్ చెబుతూ, "బెంగళూరులో నేను డ్రైవరుగా, అదే బస్సుకి రజనీ కండక్టర్ గా వున్న రోజుల్లో 1972లో 'బంగారద మనుష్య' సినిమా రిలీజైంది. మేమిద్దరం కలసి అప్పట్లో ఈ సినిమా చూశాం. దీనిని రజనీతో రీమేక్ చేయాలనిపించి ఈమధ్య అతనికి చెప్పాను. అప్పుడు మళ్లీ ఇద్దరం కలసి ఈ చిత్రాన్ని చూశాం. దీనిని రీమేక్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని రజనీ కూడా వ్యక్తపరచాడు. వచ్చే ఏడాది ఇది సెట్స్ కి వెళ్ళచ్చు" అని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)