ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వాళ్ల బాటలో మరో హీరోయిన్

Fri, Oct 17, 2014
పూర్ణ
పూర్ణ
ఐటెం పాటల ఫీవర్ ఒకరి నుంచి మరొకరికి పాకేస్తోంది. ఒకప్పుడు ఇలాంటి పాటలు చేయడానికి హీరోయిన్లు నామోషీ ఫీలయ్యేవారు. ఇప్పుడు ఒకరిని చూసి మరొకరు ముందుకు వస్తున్నారు. డబ్బుకి డబ్బు ... పేరుకి పేరు వస్తుండడంతో చాలా మంది దీనికి ఎట్రాక్ట్ అవుతున్నారు. పైగా ఈ పాటలకు ఎక్కువ రోజులు కూడా పనిచేయక్కర్లేదు. నాలుగైదు రోజులు పనిచేస్తే సరిపోతుంది. ఇలా ఈమధ్య తమన్నా, చార్మి, శ్రియా, శృతి హాసన్ ఈ పాటలు చేస్తుండడంతో మిగతా వాళ్ళు కూడా ఆసక్తి చూపుతున్నారు.



ఇప్పుడీ కోవలో మలయాళ భామ పూర్ణ కూడా చేరింది. కథానాయికగా అవకాశాలు తక్కువగా ఉండడంతో ఇక ఈ తరహా గీతాలకు కాలు కదపడానికి ఈ చిన్నది 'సై' అంటోంది. తాజాగా జయం రవి హీరోగా నటిస్తున్న 'అప్పా టక్కర్' అనే తమిళ సినిమాలో ఐటెం సాంగు చేయడానికి పూర్ణ ఓకే చెప్పేసింది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ చెన్నయ్ లో జరుగుతోంది. మరి, దీని తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ ఇలాంటి పాటలు చేస్తుందో లేదో చూడాలి!
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)