ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మెగా కలయిక' కాస్త లేట్!

Thu, Oct 16, 2014
'పిల్లా నువ్వు లేని జీవితం' లో సాయిధరమ్ తేజ్, రెజీనా
'పిల్లా నువ్వు లేని జీవితం' లో సాయిధరమ్ తేజ్, రెజీనా
చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన 'పిల్లా నువ్వు లేని జీవితం' ఆడియో ఎల్లుండ (అక్టోబర్ 18న) విడుదల కావాల్సి ఉంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలందరూ రానున్నారని ప్రచారం జరగడంతో ఈ ఆడియో రిలీజ్ కు మంచి హైప్ వచ్చింది. మరీ ముఖ్యంగా, సార్వత్రిక ఎన్నికల తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్ లు ఆ ఆడియో రిలీజ్ ద్వారా ఒకే వేదిక పంచుకోనున్నారని వార్తలు అందరిలో ఆసక్తిని రేపాయి.

అయితే, మెగా ఫ్యామిలీకి విపరీతమైన క్రేజ్ ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం 'హుదూద్' తుపాను కారణంగా అతలాకుతలం అవడంతో ఈ ఆడియో రిలీజ్ ను ఈనెల 25కు మార్చారు. ఉత్తరాంధ్ర మెగాభిమానులను దృష్టిలో పెట్టుకునే ఆడియో విడుదల తేదీని మార్చారని ఫిలింనగర్ సమాచారం. సాయిధరమ్ తేజ్ సరసన రెజీగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీవాస్, హర్షిత్ లు సంయుక్తంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)