ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Sat, Oct 11, 2014
దీపికా పదుకోనే
దీపికా పదుకోనే
* హీరో, దర్శకుడు కంటే తాను కథకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తానని బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనే స్పష్టం చేసింది. స్క్రిప్ట్‌ నచ్చిన తర్వాత తన పాత్ర ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటానని ఆమె తెలిపింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించాలని తాను ప్రస్తుతం పెద్దగా అనుకోవడం లేదని ఆమె తెలిపింది. తాను ప్రస్తుతం, బాలీవుడ్ అగ్రహీరోలతో సమానంగా స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేయగలుగుతున్నానంటే, కథాంశాల ఎంపికలో తను తీసుకున్న జాగ్రత్తలే కారణమని ఆమె వ్యాఖ్యానించింది.
* సీనియర్ నటుడు నరేష్ తనయుడు విజయ్ కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ ఫ్రెండ్లీ మూవీస్ నిర్మించబోతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 6న ప్రారంభమవుతుంది. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 80వ దశకంలో తమిళనాట గ్లామరస్ హీరోయిన్ గా రాణించిన మేనక తనయ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
* 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రం చూసిన తర్వాత దర్శకదిగ్గజం రాజమౌళి హీరో నాగశౌర్యను ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ సినిమాలో నాగశౌర్య అద్భుతంగా నటించాడని, అతని నటన తనను బాగా ఆకట్టుకుందని ఆయన వ్యాఖ్యానించాడు. హీరోగా నాగశౌర్యకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన మెచ్చుకున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)