ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో 'అల్లుడు శీను' వద్దట!

Sat, Oct 11, 2014
అక్కినేని అఖిల్
అక్కినేని అఖిల్
అక్కినేని అఖిల్ నటించే తొలి చిత్రానికి వి.వి వినాయక్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథ గురించి వినాయక్, కోన వెంకట్ లు కసరత్తు చేస్తున్నారు. అక్కినేని అఖిల్ తొలి చిత్రానికి మంచి కథతో రావాలని నాగార్జున వినాయక్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా, ఇటీవల వినాయక్ డైరెక్ట్ చేసిన 'అల్లుడు శీను' లాంటి రొటీన్ కమర్షియల్ కథ అఖిల్ కోసం వద్దని నాగార్జున వినాయక్ కు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, వినాయక్...కోన వెంకట్ టీంతో కలిసి కమర్షియల్ ఫార్మాట్ లోనే వెళుతూ మంచి కథను డెవలప్ చేసే పనుల్లో ఉన్నారని తెలుస్తోంది.

నాగచైతన్య తొలి చిత్రం 'జోష్' కథకు సంబంధించి తాను మరింత జాగ్రత్త పడి వుంటే బాగుండేదని నాగార్జున ఇప్పటికీ బాధపడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో, కథ అద్భుతంగా వస్తేనే అక్కినేని అఖిల్ తొలి చిత్రం సెట్స్ పైకి వెళ్లాలని నాగార్జున పక్కా అభిప్రాయంతో ఉన్నారట!
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)