ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అరవై ఏళ్ల గ్లామరమ్మ!

Fri, Oct 10, 2014
రేఖ
రేఖ
తనకు పుట్టిన రోజు ప్రత్యేకం అంటూ ఏమీ ఉండదని చెబుతోంది బాలీవుడ్ భామ రేఖ. నిన్నటి తరం అందాలతారగా ... గ్లామర్ కు కొత్త నిర్వచనం చెప్పిన సౌందర్యరాశిగా రేఖ దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. నేటితో ఆమె అరవై ఏళ్లు పూర్తి చేసుకుని 61వ పడిలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా బర్త్ డే గురించి అడిగితే ఆమె భిన్నంగా స్పందించింది.


"మొదటి నుంచీ కూడా నేను బర్త్ డేలకు ప్రాధాన్యం ఇవ్వను. అసలు చాలా మంది ఈ పుట్టిన రోజులకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారో నాకైతే అర్ధం కాదు. నిజం చెప్పాలంటే, ప్రతిరోజూ నాకు జీవితంలో ప్రత్యేకమే. ప్రతి రోజునీ ఆస్వాదిస్తాను. ప్రతి రోజూ నాకు ఒక వేడుకే!" అని చెప్పింది. ఈ వయసులో కూడా గ్లామర్ తో మెరిసిపోతున్న రేఖ తాజాగా అమితాబ్ తో కలసి 'షమితాబ్' అనే హిందీ సినిమాలో నటిస్తోంది!
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)