ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిన్మయిని ఆశ్చర్యపరచిన తలైవా

Wed, Oct 08, 2014
చిన్మయి
చిన్మయి
సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ లకే స్టార్, సెలబ్రిటీలకే సెలబ్రిటీ. రజనీకాంత్ ను కలుసుకున్నప్పుడు బాగా పేరు మోసిన వ్యక్తులు సైతం చిన్నపిల్లవాళ్లలా మారిపోతారు. ఆయనను కలుసుకున్న క్షణాలను జీవితాంతం అపురూపంగా గుర్తుపెట్టుకుంటారు. తాజాగా, ఇలాంటి సంఘటనే ఒకటి ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయికి జరిగింది. ఇటీవల ఓ కార్యక్రమంలో రజనీకాంత్ తనను చూడగానే తన వైపు చేయి వూపి, హాయ్ చెప్పి 'ఎలా ఉన్నారు?' అని పలకరించారని ఆమె తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసింది.

అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యుండి రజనీ సింప్లిసిటీకి తాను ఆశ్చర్యపోయానని ఆమె వ్యాఖ్యానించింది. రజనీ పలకరించిన క్షణాలు తన జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలని, వాటిని జీవితాంతం గుర్తుంచుకుంటానని ఆమె పేర్కొంది. రజనీ కాంత్ చిత్రాల్లో పలు పాటలను చిన్మయి పాడారు. 'శివాజీ' లో 'సుహానా' పాటను, 'ఎంథిరన్'లో 'కిలిమంజారో' ను, 'కొచ్చాడియాన్' లో 'ఇదయం' పాటను ఆమె ఆలపించారు.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)