ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చైతూ చిత్రం రిలీజవుతోంది

Thu, Oct 02, 2014
'ఒక లైలా కోసం'లో చైతన్య, పూజా హెగ్డే
'ఒక లైలా కోసం'లో చైతన్య, పూజా హెగ్డే
నాగ చైతన్య నటించిన చిత్రం ఆఖరికి రిలీజ్ డేట్ పొందింది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో చైతూ నటించిన 'ఒక లైలా కోసం' చిత్రం ఎప్పుడో విడుదలకు సిద్ధమైంది. అయితే, రకరకాల కారణాల వల్ల గత కొన్నాళ్లుగా ఇది వాయిదాపడుతూ వచ్చింది. ఆఖరికి ఈ నెల 17న దీనిని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించినట్టు తాజా సమాచారం.


'మనం' సినిమా తర్వాత అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించిన చిత్రమిది. ప్రస్తుతం మంచి జోరు మీదున్న అనూప్ రూబెన్స్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఇక పూజా హెగ్డే ఇందులో కథానాయికగా చైతూకి జోడీగా నటించింది. గతంలో 'రాముడు కాదు కృష్ణుడు' చిత్రంలో ఏఎన్నార్ పై చిత్రీకరించిన 'ఒక లైలా కోసం... తిరిగాను లోకం' అనే పాటను ఇందులో రీమిక్స్ చేశారు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)