ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'స్వామి రారా' అంటున్న చరణ్!

Wed, Oct 01, 2014
సుధీర్ వర్మ
సుధీర్ వర్మ
ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకోవడం రాంచరణ్ ప్రత్యేకత. చిన్న డైరెక్టరైన సంపత్ నందికి రెండేళ్ల క్రితం 'రచ్చ' ద్వారా ఛాన్స్ ఇచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఇటీవల వరుస ప్లాపుల్లో ఉన్న కృష్ణవంశీకి అవకాశమిచ్చి అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. తాజాగా, 'గోవిందుడు అందరి వాడేలే'కు పాజిటివ్ టాక్ రావడంతో రాంచరణ్ నిర్ణయాలపై ఫిలిం సర్కిల్స్ లో కూడా గురికుదురుతోంది.

తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో రాంచరణ్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాడని సమాచారం. తన తదుపరి చిత్రాన్ని శ్రీను వైట్ల, గౌతమ్ మీనన్ లాంటి పాప్యులర్ డైరక్టర్లతో చేస్తాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాంచరణ్ మరో రకంగా ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. తొలి చిత్రం 'స్వామి రారా'తో మంచి హిట్ కొట్టిన సుధీర్ వర్మ ఇటీవల రాంచరణ్ కు ఓ కథ చెప్పాడని తెలుస్తోంది. అతను చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఆయన దర్శకత్వంలో చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం, సుధీర్ వర్మ నాగచైతన్య హీరోగా ఓ క్రైమ్ కామెడీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)