ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మోడీని టార్గెట్ చేసిన వర్మ

Tue, Sep 30, 2014
అమితాబ్ తో  రాంగోపాల్ వర్మ
అమితాబ్ తో రాంగోపాల్ వర్మ
వివాదాలకు, సంచలనాలకు మారుపేరైన రాంగోపాల్ వర్మ తాజాగా మరో అతి పెద్ద సంచలనానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తోంది. గతంలో బాల్ థాకరే జీవితం ఆధారంగా 'సర్కార్' సినిమాను, పరిటాల రవి జీవితం ఆధారంగా 'రక్తచరిత్ర'ను.. దావూద్, చోటారాజన్ ల జీవితాల ఆధారంగా 'కంపెనీ' చిత్రాన్ని రాంగోపాల్ వర్మ రూపొందించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు. తాజాగా, ఈ దర్శకుడి దృష్టి ప్రధానమంత్రి నరేంద్రమోడీపై పడింది.


మోడీ జీవితం ఆధారంగా 'భగవాన్' అనే సినిమాను తెరకెక్కించాలని వర్మ ఉత్సాహంగా ఉన్నాడని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. దీనికోసం, నరేంద్రమోడీ పాత్రలో నటించాలని అమితాబ్ పై వర్మ ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అయితే, వర్మ ఆఫర్ పై అమితాబ్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వర్మ అంటేనే ఏదో వివాదం రేపుతాడనీ, ఇందులో నటిస్తే అనవసరంగా ఇరుక్కుపోతామేమోనని బిగ్ బీ సందేహిస్తున్నాడట!
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)