ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ట్రాజెడీ సినిమాలో దీపిక

Sun, Sep 28, 2014
దీపికా పదుకొనే
దీపికా పదుకొనే
బాలీవుడ్ సెక్సీతార దీపికా పదుకొనే త్వరలో ఓ విషాద ప్రేమకథలో కథానాయికగా నటించనుంది. ఆమధ్య అమెరికాలో వచ్చిన 'ది ఫాల్ట్స్ ఇన్ అవర్ స్టార్స్' అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ నవల అక్కడ అమ్మకాల్లో సంచలనం సృష్టించింది.


ఇప్పుడీ నవలను హిందీలో తెరకెక్కిస్తున్నారు. కేన్సర్ వ్యాధిగ్రస్తులైన ఓ అబ్బాయి, అమ్మాయి పునరావాస కేంద్రంలో ఒకరికొకరు పరిచయం అవుతారు. అక్కడ ఇద్దరూ ప్రేమలో పడతారు. ఓపక్క ప్రాణాంతక వ్యాధి బాధిస్తున్నా ప్రేమలో మాత్రం విజయం సాధించడానికి వీరిద్దరూ పడే తాపత్రయం విషాదంతో ముగుస్తుంది.


ఇటీవల హిందీలో 'ఫైండింగ్ ఫాన్నీ' చిత్రాన్ని రూపొందించిన హోమీ అడజానియా దర్శకత్వం వహించే ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దీపిక జంటగా నటిస్తారు. ఇది తనకొక చాలెంజ్ అని చెబుతోంది దీపిక.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)