ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

త్వరలో సూపర్ స్టార్ 'నాటకం'

Mon, Sep 15, 2014
రజనీకాంత్
రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టేజ్ పై ఓ నాటకంలో నటిస్తే ఎలా వుంటుంది? అదిరిపోతుంది కదూ ... తమ అభిమాన కథానాయకుడి లైవ్ పెర్ఫార్మెన్స్ చూస్తూ అభిమానులు రెచ్చిపోతారు కదూ! త్వరలో ఈ ముచ్చట తీరే అవకాశం మెండుగా కనిపిస్తోంది.


ప్రముఖ తమిళ రంగస్థల నటుడు, రచయిత, రజనీకాంత్ తోడల్లుడు వైజీ మహేంద్రన్ ఈ కార్యక్రమాన్ని నెత్తిన వేసుకుంటున్నాడు. తాజాగా ఆయన రజనీని దృష్టిలో పెట్టుకుని ఓ నాటకం రాస్తున్నాడు. ఇందులో రజనీ చేత నటింపజేయాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు.


దీని గురించి మహేంద్రన్ చెబుతూ, "ఇటీవల రజనీని కలసి, ఆయన కోసం నాటకం రాస్తున్నాననీ అందులో నటించాలనీ కోరాను. ఈ విషయంపై త్వరలోనే మళ్లీ ఆయనని కలుస్తాను. నా మాట ఆయన కాదనరనే నమ్మకం వుంది" అంటున్నాడు ధీమాగా.


సో ... ప్రస్తుతం రజనీ చేస్తున్న 'లింగా' సినిమా పూర్తయ్యాక, ఈ నాటకంలో ఆయన నటించే అవకాశం వుంది!
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)