ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ కల్యాణ్ అంటే ఇష్టమట!

Sat, Sep 13, 2014
శింబు
శింబు
పవన్ కల్యాణ్ కి పాట పాడాలనుందని చెబుతున్నాడు తమిళ హీరో శింబు. తెలుగులో తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ అని కూడా వెల్లడించాడు. ఆమధ్య 'బాద్ షా' తెలుగు సినిమాలో శింబు 'డైమండ్ గాళ్' పాట పాడిన సంగతి విదితమే. దీనికి గాను ప్రస్తుతం కౌలాలంపూర్ లో జరుగుతున్న 'సైమా' అవార్డుల్లో మనవాడు ఉత్తమ గాయకుడు అవార్డు అందుకున్నాడు.


ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ, "ఈ పాట పాడే అవకాశాన్ని ఇచ్చినందుకు ఎన్టీఆర్ కి, తమన్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ అవార్డుని మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షంలో అందుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది. అలాగే, తెలుగులో నా అభిమాన నటుడు పవన్ కల్యాణ్. ఆయనకి కూడా ఓ పాట పాడాలనుంది" అన్నాడు. దాంతో అవార్డుల ప్రాంగణం క్లాప్స్ తో మార్మోగిపోయింది.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)