ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆదా శర్మ 'రింగా రింగా'

Wed, Sep 10, 2014
ఆదా శర్మ
ఆదా శర్మ
'హార్ట్ ఎటాక్' భామ ఆదా శర్మ త్వరలో అల్లు అర్జున్ సరసన నటించనున్న సంగతి మనకు తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఈ ముద్దుగుమ్మను ఓ కథానాయికగా ఎంచుకున్నారు. అదలా ఉంచితే, ఈలోగా బన్నీ సాంగుకు అమ్మడు డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతోంది.


ఈ నెల 12-13 తేదీల్లో కౌలాలంపూర్ లో జరిగే 'సైమా' అవార్డుల వేడుకలో ఈ చిన్నది పెర్ఫార్మ్ చేస్తోంది. అందులో భాగంగా 'ఆర్య 2'లోని అల్లు అర్జున్ పాప్యులర్ నెంబర్ 'రింగా రింగా' పాటకు స్టేజ్ పై డ్యాన్స్ చేయనుంది.


ఈ విషయాన్ని ఆదా శర్మ తాజాగా ట్విట్టెర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ పాటకు డ్యాన్స్ ప్రాక్టీసు చేస్తున్నాననీ, ఇది తన తొలి స్టేజ్ పెర్ఫార్మెన్స్ అనీ ట్వీట్ చేసింది. దీంతో పాటు తన 'హార్ట్ ఎటాక్' సినిమాలోని ఓ పాటను కూడా పెర్ఫార్మ్ చేస్తుందట!
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)