ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆమెని 'బబ్లీ గాళ్' అనకూడదట!

Tue, Sep 09, 2014
పరిణీతి చోప్రా
పరిణీతి చోప్రా
ఇప్పటివరకు చేసింది నాలుగు సినిమాలే అయినా బొద్దుగా ముద్దుగా తన చిరునవ్వుతో హిందీ ప్రేక్షకులను నటి పరిణీతి చోప్రా బాగానే ఆకట్టుకుంది. దాంతో, ఆమెను ముద్దుగా 'బబ్లీగాళ్' అని పిలుచుకుంటున్నారు. కానీ, ఇప్పుడా పిలుపును అమ్మడు అగౌరవంగా భావిస్తోంది. అభిమానులు తననలా పిలిచినప్పుడు హాస్యాస్పదంగా అనిపిస్తోందని అనుకుంటున్నానని అంటోంది.


తాను చేసిన సినిమాల్లో దేనికదే భిన్నంగా ఉంటుందని, ఏ ఒక్క చిత్రం కూడా ఒకేలా ఉండదనీ చెప్పింది. అలాంటప్పుడు బబ్లీ ఇమేజ్ ప్రసక్తే రాదని చెప్పింది. కాబట్టి, మరోసారి తన సినిమాలు చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని పరిణీతి కోరుకుంటోంది. నటుడు ఆదిత్యా రాయ్ కపూర్ తో ఈ భామ నటించిన 'దావతె ఇష్క్' త్వరలో విడుదల కానుంది.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)