ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'రుద్రమదేవి' పూర్తయింది

Sat, Sep 06, 2014
గుణశేఖర్
గుణశేఖర్
అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న 'రుద్రమదేవి' సినిమా షూటింగ్ పూర్తయింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చారిత్రాత్మక కథా చిత్రం గత కొన్నాళ్లుగా చిత్ర నిర్మాణాన్ని జరుపుకుంటున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా చిత్రం పూర్వాపరాలను వివరిస్తూ దర్శకుడు గుణశేఖర్ పత్రికా ప్రకటన విడుదల చేశాడు.


"2002లోనే ఈ సినిమాకు సంబంధించిన చారిత్రక పరిశోధన, కథా రూపకల్పన ప్రారంభమయ్యాయి. అయితే, 2012 ఫిబ్రవరిలో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. 2013 ఫిబ్రవరిలో వరంగల్ లోని వేయి స్తంభాల గుడిలో ముహూర్తం నిర్వహించాం. ఇక ఇప్పుడు 2014 సెప్టెంబర్ 4న హైదరాబాదు శివారు గోపన్నపల్లిలో వేసిన ఏడు కోటగోడల సెట్లో షూటింగ్ పూర్తయింది.


హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో స్టీరియోఫోనిక్ త్రీడీ ఫార్మేట్లో రూపొందిన తొలి భారతీయ సినిమా గా ఇది చరిత్ర పుటలకు ఎక్కుతోంది. ప్రేక్షకులకు ఇది అంతర్జాతీయ విజువల్ థ్రిల్ ఇవ్వనుంది. అందుకే, ఆయా ధియేటర్ల వారు కూడా అందుకు అనుగుణంగా తమ తమ ధియేటర్లను సిద్ధం చేసుకుంటున్నారు ఓ మహాయజ్ఞంలా సాగిన ఈ షూటింగ్ అందరి సహకారంతో దిగ్విజయంగా ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకువస్తాం" అని చెప్పారు దర్శకుడు.


ఇక, ఇందులో అనుష్కతో బాటు హేమాహేమీలు నటించడం జరిగింది. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించగా ... రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్ రాజ్, నిత్యామీనన్, కేథరీన్ వంటి తారలు ఇతర పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం... అజయ్ విన్సెంట్ చాయాగ్రహణం... తోట తరణి ఆర్ట్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)