ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెండితెరపై సింగర్ల జంట!

Wed, Sep 03, 2014
శ్రావణ భార్గవి, హేమచంద్ర
శ్రావణ భార్గవి, హేమచంద్ర
వాళ్లిద్దరూ గాయనీగాయకులు...

వాళ్లిద్దరూ సంగీత కార్యక్రమాలకు వ్యాఖ్యాతలు కూడా ...

పైపెచ్చు, ఇద్దరూ భార్యాభర్తలు ...

ఇప్పుడు వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వారే హేమచంద్ర ... శ్రావణ భార్గవి!

నిజజీవితంలో ప్రేమికులైన ఈ జంట వెండితెరపై కూడా ఆ ప్రేమను పండించడానికి సిద్ధపడుతున్నారు.

తామిద్దరం కలసి తాజాగా 'లక్కీ లవ్' అనే షార్ట్ ఫిలింలో నటించినట్టు శ్రావణ భార్గవి చెబుతోంది.

హైదరాబాదు గీతం కాలేజ్ వారు ఈ చిత్రం ప్రపోజల్ తెచ్చారనీ, కాన్సెప్ట్ నచ్చడంతో నటించామనీ చెప్పింది.

"ఇప్పటికే మమ్మల్ని సినిమాల్లో నటించమంటూ ఆఫర్లు వచ్చాయి. అయితే, ఆయా పాత్రలు నచ్చకపోవడంతో చేయలేదు.

మంచి ఆఫర్ వస్తే కనుక సినిమాల్లో కూడా నటించాలనుకుంటున్నాం" అని చెప్పింది ఈ మధురగాయని.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)