ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పద్నాలుగేళ్ల తర్వాత కలుస్తున్నారు

Mon, Aug 25, 2014
మణిరత్నం.
మణిరత్నం.
తన ప్రతి చిత్రాన్ని ఆ దర్శకుడు ఎంతో ఇష్టంతో రూపొందిస్తే...

తన కెమెరా పనితనంతో సినిమాను మరింత అందంగా చూపిస్తాడు ఆ కెమెరామేన్.

అలా వారిద్దరూ ఏకంగా ఆరు సినిమాలకు కలసి పనిచేశారు.

చివరి చిత్రం 'అలైపాయుదే' (తెలుగులో 'సఖి').

మళ్లీ పద్నాలుగు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు కలుస్తున్నారు.

వారే దర్శకుడు మణిరత్నం... మరొకరు సినిమాటొోగ్రాఫర్ పీసీ శ్రీరాం!

త్వరలో ఈ ఇద్దరూ కలసి పనిచేయబోతున్నారు.

మణి కొత్త ప్రాజెక్టు సెప్టెంబర్ చివరి వారంలో మొదలవనుంది.

ప్రస్తుతం హిందీ 'షమితాబ్'కు పీసీ పని చేస్తున్నాడు.

అది ముగిసిన వెంటనే మణి యూనిట్ లో జాయినవుతాడు.

"ప్రస్తుతం పీసీ ముంబయిలో దర్శకుడు బాల్కీ మూవీ చేస్తున్నాడు.

ఇటీవలే కొత్త చిత్రం కోసం మణిని కలసి చర్చించాడు.

ప్రాజెక్టును ఫైనలైజ్ చేశాడు. ఇంకా లీడ్ యాక్టర్లను ఖరారు చేయాల్సి ఉంది.

రెహమాన్ ఇప్పటికే ఓకే అయ్యాడు" అని మణి చిత్ర యూనిట్ సమాచారం.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)