ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జగన్ వెంట రాజశేఖర్ దంపతులు

Mon, Dec 20, 2010
         రాజశేఖర్, జీవిత జంట మళ్లీ ఇప్పుడు టీవీల ముందుకు వచ్చింది. ఈసారి రాజీనామా అస్త్రంతో వచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీకి రాజేనామా చేస్తున్నట్టు ప్రకటించారు. జగన్ వెంట నడవడానికి నిశ్చయించుకున్నట్టు ప్రకటించారు. "రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి మర్యాద, గౌరవం మాకిప్పుడు పార్టీలో లేవు. మమ్మల్ని అవసరానికి వాడుకుని ఇప్పుడు వదిలేసారు. అసలు మమ్మల్ని పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదు. అయినా జగన్ గారు వెళ్లిపోవడంతో కాంగ్రెస్ పని కూడా అయిపోయింది. జగన్ గారు మాకెంతో గౌరవం ఇస్తారు. అందుకే, ఆయన వెంటే నడవాలని డిసైడ్ అయ్యాం. రేపు విజయవాడలో ఆయనని కలుస్తున్నాం. ఆయన చేసే దీక్షలో మేము కూడా పాల్గొంటాం. ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఒక్క జగన్ గారికే వుంది. అది ఆయనకే సాధ్యం" అంటూ ఈ జంట చెప్పుకొచ్చారు. సో... ఇక ఇప్పుడు తమ బద్ధ శత్రువు చిరంజీవిపై మళ్లీ అటాక్ చేయడం మొదలెడతారన్న మాట!  
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)