ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బీహార్ మంత్రిని కలసిన శృతి!

Sat, Aug 09, 2014
శృతి హాసన్
శృతి హాసన్
శృతి హాసన్ కీ, బీహార్ మంత్రికీ సంబంధం ఏమిటనుకుంటున్నారా?

మరక్కడే వుంది ... ఆమె నటిస్తున్న సినిమాలో ఆయన గారు కూడా నటిస్తున్నారు.

విషయానికొస్తే, విశాల్ తో కలసి ఆమె నటిస్తున్న 'పూజై' తమిళ సినిమా షూటింగ్ ఇటీవల కొంత భాగాన్ని బీహార్లో నిర్వహించారు.

ఈ సందర్భంగా అక్కడ షూటింగ్ అనుమతుల విషయంలో ఆ రాష్ట్ర యువజన సర్వీసుల మంత్రి వినయ్ ఈ సినిమా యూనిట్ కి ఎంతగానో సహకరించారట.

ఆ సమయంలో మంత్రిగారు తాను కూడా ఆర్టిస్టునేననీ, భోజ్ పురీ సినిమాలలో నటించాననీ చెప్పడంతో చిత్ర దర్శకుడు హరి ఆయనను సంతోషపెట్టడానికి తమ సినిమాలో కూడా ఆయనకు ఓ వేషం ఇచ్చాడట.

దాంతో మంత్రివర్యులు ఈ సినిమాలో జిల్లా కలెక్టర్ వేషం కట్టారు... అదీ సంగతి!
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)