ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కృష్ణవంశీకి 'మెగా' కానుక!

Fri, Aug 08, 2014
కృష్ణవంశీ
కృష్ణవంశీ
కృష్ణవంశీ పొగరుబోతు ...

కృష్ణవంశీ గర్విష్టి...

కృష్ణవంశీ అహంకారి ...

ఇలాంటి కృష్ణవంశీ గతంలో కనిపించాడు.

ఇప్పుడు తాను మారిపోయాడు.

ఆ మారిన కృష్ణవంశీ రాత్రి 'గోవిందుడు' టీజర్ వేడుకలో తనను తాను ఆవిష్కరించుకున్నాడు.

"ఏ హీరోకైనా నేను అవకాశం ఇవ్వాలి. నాకు ఒకడు అవకాశం ఇవ్వడమేమిటి? అనేంత మూర్ఖత్వంతో వుండేవాణ్ణి.

అది నా పొగరో ... మూర్ఖత్వమో ... అమాయకత్వమో ... దురదృష్టమో తెలియదు.

అందుకే, అప్పట్లో చిరంజీవి గారితో చేసే అవకాశం వచ్చినా జారవిడుచుకున్నాను" అన్నారు కృష్ణవంశీ.

"గత మూడు నాలుగేళ్ళుగా నా కెరీర్ డైలమాలో పడిపోయింది. నన్ను చూసి అందరూ ముఖం తిప్పుకునేవారు.

ప్రకాష్ రాజ్ లాంటి స్నేహితుడు కూడా దూరమయ్యాడు.

ఒంటరితనాన్ని ఫీలయ్యాను. ఇక నా పని అయిపోయిందా? దర్శకుడిగా నేను చచ్చిపోయానా? అనిపించింది.

అలాంటి సమయంలో చరణ్ మేనేజర్ ని కలసి, చరణ్ తో పది నిమిషాలు మాట్లాడాలి అని చెప్పాను.

కబురెళ్ళగానే చరణ్ నన్ను రమ్మని పిలిచాడు. ఆ సమయంలో చరణ్ నాపై చూపిన గౌరవానికి కళ్ళు చమర్చాయి.

నేనింకా చచ్చిపోలేదు అనిపించింది. నా ఆలోచనలని అతనికి చెప్పాను.

వెంటనే 'మనం సినిమా చేద్దాం' అన్నాడు. వెయ్యేనుగుల బలం అంటే ఏమిటో అప్పుడే తెలిసింది" అని చెప్పాడు వంశీ.

అలాగే, గతంలో చిరంజీవి తనకిచ్చిన కారు గిఫ్ట్ గురించి కూడా వివరించాడు.

"గతంలో ఓసారి చిరంజీవి గారిని లాండ్ క్రూజర్ కారు అడిగాను.

మాట వరసకి అడిగితే, వెంటనే కొత్త కారు తెప్పించి తాళాలు ఇచ్చారు.

నేను ఆశ్చర్యపోయాను. అయినా తేరుకుని, 'నాకు కానుకలు తీసుకోవడం ఇష్టం వుండదు అన్నయ్యా' అన్నాను.

'అన్నయ్య ఇస్తున్నప్పుడు తీసుకోవాలి' అంటూ తాళాలు నా చేతిలో ఉంచారు" అంటూ చెప్పుకొచ్చాడు కృష్ణవంశీ.

మొత్తానికి ఈ ప్రసంగం ద్వారా అందరికీ 'కొత్త కృష్ణవంశీ' కనిపించాడు!
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)