ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వారిద్దరూ మళ్లీ కలుస్తున్నారు!

Mon, Jul 28, 2014
వైరముత్తు- ఇళయరాజా
వైరముత్తు- ఇళయరాజా
ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం విడిపోయిన ఇద్దరు లెజండ్స్ మళ్లీ ఇప్పుడు కలుస్తున్నారు.

వారిద్దరూ తమిళ కవి వైరముత్తు ... సంగీత దర్శకుడు ఇళయరాజా!

80వ దశకంలో వీరిద్దరూ తమిళ పాటను ఒక ఊపు ఊపేశారు.

1986లో ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు వచ్చి దూరమైపోయారు.

ఈయనకు ఆయన రాయడు ... ఆయనకు ఈయన బాణీ కట్టడు.

అయితే, ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా కారణంగా వీరిద్దరూ ఇప్పుడు కలుస్తున్నారు.

యువన్ శంకర్ సంగీతం సమకూరుస్తున్న 'ఇదం పోరుల్ ఆవళ్' చిత్రం కోసం వైరముత్తు రాసిన పాటను రాజా పాడుతున్నాడు.

దీంతో ఈ చిత్ర దర్శకుడు శీను రామసామి తెగ సంబరపడిపోతున్నాడు.

"రాజాగారు ఒప్పుకోవడం నా అదృష్టం. రాజాగారు రమణ మహర్షిని ఫాలో అవుతారు. నేను కూడా రమణులకు భక్తుడినే.
అందుకే ఆయన ఈ పాట పాడడానికి అంగీకరించారు. అలాగే, ఇందులో యువన్ పాత్ర కూడా ఎంతో వుంది" అంటున్నాడు దర్శకుడు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)