ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'దృశ్యం' వివాదం ఏమవుతుందో!

Mon, Jul 21, 2014
ఏక్తా కపూర్
ఏక్తా కపూర్
వెంకటేష్, మీనా జంటగా ఇటీవల వచ్చిన 'దృశ్యం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తోంది.

అయితే, తాజాగా జరిగిన ఓ పరిణామం మాత్రం ఆ నిర్మాతలకు దడ పుట్టిస్తోంది.

దీనికి కారణం, ఈ సినిమా ఒరిజినల్ మలయాళ వెర్షన్ నిర్మాతకు, రచయితకు బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ లీగల్ నోటీస్ పంపడమే!

ఇటీవల తాను జపాన్ కు చెందిన 'ద డేవోషన్ ఆఫ్ సస్పెక్ట్ X' అనే నవల వెండితెర హక్కులను తీసుకున్నాననీ, అయితే 'దృశ్యం' చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఆ నవల నుంచి కాపీ కొట్టారనీ ఆమె ఆరోపిస్తూ లీగల్ నోటీస్ పంపింది.

మలయాళ వెర్షన్ విడుదలైనప్పుడు పట్టించుకోకుండా, ఇప్పుడు తెలుగు వెర్షన్ విడుదలై బాగా ఆడుతున్న సమయంలో ఏక్తా కపూర్ ఇలా భయపెట్టడం మన తెలుగు నిర్మాతల్ని కూడా ఇబ్బంది పెడుతోంది.

సదరు నిర్మాతల నుంచి ఆమె నష్టపరిహారం ఏమైనా ఆశిస్తోందా? అన్నది ఇంకా తెలియాల్సివుంది.

అయితే, ఈ వివాదంతో తమకేమీ సంబంధం లేదని తెలుగు వెర్షన్ నిర్మాత సురేష్ బాబు అంటున్నాడు.

మరి, ఈ ఇష్యూ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి!
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)