ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వారణాసిలో భరణి ప్రేమకథ!

Mon, Jul 14, 2014
భరణి
భరణి
వారణాసి నేపథ్యంలో ఓ మంచి ప్రేమకథను తెరకెక్కించాలని వుందని అంటున్నారు ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి.

ప్రస్తుతం భరణి కాశీలో వున్నారు. వాళ్లత్తగారు కాశీ తీసుకువెళ్ళమంటే కుటుంబంతో కలసి అక్కడికి వెళ్ళారు.

కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాక అపూర్వమైన ఆధ్యాత్మిక భావన కలిగిందట.

అదే సందర్భంలో ఈ పురాతన పట్టణం నేపథ్యంలో ఓ ప్రేమకథా చిత్రం తీయాలన్న కోరిక ఆయనకు కలిగింది.

అదే చెబుతూ, "గతంలో నా శిష్యుడు జనార్ధన మహర్షి వారణాసి నేపథ్యంలో ఓ ప్రేమకథ రాసి నాకు చెప్పాడు.
ఒకవేళ 'భక్తకన్నప్ప' తీయడం ఆలస్యమైతే కనుక ముందుగా దీనిని తెరకెక్కిస్తాను" అని చెప్పారు భరణి.

సునీల్ తో రూపొందించే 'భక్తకన్నప్ప' చిత్రం స్క్రిప్ట్ రెడీగా ఉందనీ, సునీల్ షూటింగ్ ఎప్పుడంటే అప్పుడు తాను రెడీ అనీ చెప్పారు భరణి.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)