ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Sat, Jul 05, 2014
శృతి హాసన్
శృతి హాసన్
* మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'ఆగడు' సినిమాలో శృతి హాసన్ ఐటెం పాట చేస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచీ ఈ పాటను హైదరాబాదులో షూట్ చేస్తున్నారు. కాగా, ఈ పాటలో నటిస్తున్నందుకు ఈ అమ్మడు 50 లక్షలు తీసుకుంటోందట!

* సంపత్ నంది నిర్మిస్తున్న 'గాలిపటం' చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 12న హైదరాబాదులో నిర్వహిస్తారు. వినూత్నంగా జరిగే ఈ వేడుకలో పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొంటారు. కాగా, ఇందులో ఆది హీరోగా, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అకిహివా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్ గాంధీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.

* వెంకటేష్, మీనా జంటగా నటించిన 'దృశ్యం' చిత్రాన్ని ఈ నెల 11న రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు హైదరాబాదులో జరిగిన ప్రెస్ మీట్లో నిర్మాతలు ప్రకటించారు. ఎప్పటికప్పుడు తాను చేసే ప్రయోగాలను ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారనీ, ఆ నమ్మకంతోనే ఈ చిత్రం చేశాననీ హీరో వెంకటేష్ చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)