ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రచయిత్రిగా వస్తున్న కథానాయిక

Sat, Jun 21, 2014
విద్యాబాలన్
విద్యాబాలన్
'కహానీ' సినిమా తర్వాత బాలీవుడ్ అందాలతార విద్యాబాలన్ సినిమాల ఎంపికలో జాగ్రత్త పడుతోంది.

వ్యక్తిగతంగా పేరు తెచ్చే పాత్రల కోసం ఎదురుచూస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు ఓ ఆఫర్ వచ్చింది.

రచయిత్రిగా నటించే చాన్స్ విద్యాను వెతుక్కుంటూ వచ్చింది.

కేరళకు చెందిన సంచలన, వివాదాస్పద రచయిత్రి కమలాదాస్ జీవితం ఆధారంగా మలయాళ దర్శకుడు కమల్ ఓ చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

సంచలనమైన ఇతివృత్తాలను ఎంచుకుని కమలాదాస్ నవలలు రాసింది.

అవి పలు భాషల్లోకి అనువాదం కూడా అయ్యాయి.

హిందూ నాయర్ల కుటుంబంలో జన్మించిన ఆమె తన 65వ ఏట ఇస్లాం మతం స్వీకరించి కమలా సురయ్యాగా పేరు మార్చుకుంది.

ఈ పాత్రకు విద్యా అయితేనే బాగుంటుందన్న ఆలోచనతో దర్శకుడు ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నాడట.
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)