ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సునీల్ తో దిల్ రాజు సినిమా

Mon, Jun 09, 2014
సునీల్
సునీల్
హాస్య కథానాయకుడు సునీల్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ సినిమా తీయనున్నాడు.

గతంలో 'జోష్' చిత్రానికి దర్శకత్వం వహించిన వాసూవర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడు.

దీని గురించి దిల్ రాజు చెబుతూ, "నాన్ స్టాప్ ఎంటర్ టైనర్ గా ఇది రూపొందుతుంది.
విదేశాల్లో కథ మొదలై ఇండియాలో ముగుస్తుంది. మర్యాదరామన్న తరహాలో సునీల్ కి ఇది పేరు తెస్తుంది. ఆగష్టులో షూటింగ్ ప్రారంభిస్తాం" అని తెలిపారు.

ఇదిలా ఉంచితే, గతంలో వాసూవర్మ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు 'లవర్' అనే సినిమా తీయనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఆ చిత్రాన్నే సునీల్ తో తీస్తున్నారా? అన్నది తెలియాల్సివుంది.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)