ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నలభై ఏళ్ల సక్సెస్ ఫుల్ నిర్మాత

Thu, May 01, 2014
కె.యస్. రామారావు
కె.యస్. రామారావు
ఈవేళ రెండు మూడేళ్లు నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగడమే గగనం.

ఒక సినిమాతోనే వెనక్కి వెళ్ళిపోయేవాళ్లు ఎక్కువిక్కడ.

అటువంటిది నలభై ఏళ్లుగా నిర్మాతగా కొనసాగుతూ మంచి సినిమాలను నిర్మించిన ఘనత సాధించారు క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.యస్. రామారావు.

ఆయన పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 40 ఏళ్లు నిండాయి.

ఈ సందర్భంగా ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తన అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు.

"1974లో క్రియేటివ్ కమర్షియల్స్ నెలకొల్పాను. మొదట్లో రేడియో పబ్లిసిటీ చేసే వాళ్ళం.
'అల్లూరి సీతారామరాజు'తో మొదలెట్టి, ముత్యాలముగ్గు, అడవిరాముడు, వేటగాడు, కొండవీటి సింహం వంటి పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశాం.
నిర్మాతగా 'మౌనగీతం' సినిమాతో మా ప్రయాణం మొదలైంది.
తర్వాత 'అభిలాష' తీశాం. చిరంజీవి, కోదండరామిరెడ్డి, యండమూరి, క్రియేటివ్ కమర్షియల్స్ ... అనేవి ఒక కాంబినేషన్.
అన్నీ కుటుంబ కథా చిత్రాలే తీశాం. 40 ఏళ్లలో 40 సినిమాలు తీశాం.
ప్రస్తుతం శంకర, ఉలవచారు బిర్యానీ తీస్తున్నాం. మరికొన్ని సినిమాలు ప్లానింగులో వున్నాయి" అని చెప్పారు రామారావ్.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)